మహిళ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Mar 26 2026 10:53 AM | Updated on Mar 26 2026 10:53 AM

ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో రాఘవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో బుధవారం మాజీ సర్పంచ్‌ సత్యనారాయణగౌడ్‌ మజ్జిగ పంపిణీ చేశారు. నాయకులు రాఘవేందర్‌గౌడ్‌, శివ, విజయ్‌కుమార్‌, సంపత్‌కుమార్‌, చంద్రశేఖర్‌, కుమార్‌, విజయ్‌యాదవ్‌, లింగమయ్య, రవి, రాము, రాజు పాల్గొన్నారు.

కొత్తూరు: ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని తీగాపూర్‌ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ నర్సయ్య తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన హంసమ్మ(49) ఈ నెల 24న ఉదయం కోడలితో పడింది. విషయం తెలుసుకున్న ఆమె కొడుకు తల్లి, భార్యకు సర్ధిచెప్పి పని నిమ్తితం బయటకు వెళ్లాడు. కొడుకు వెళ్లిన కాసేపటికి తల్లి హంసమ్మ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గతంలోనూ గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయి పది రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శనిగ పంటకు

నిప్పంటించిన దుండగులు

కొందుర్గు: పండించిన పంటకు గుర్తు తెలియన వ్యక్తులు నిప్పంటించిన ఘటన చౌదరిగూడ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అబ్దుల్‌ ఖదీర్‌ శనిగ పంట సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి కుప్పగా ఉంచాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. బుధవారం రైతు అబ్దుల్‌ ఖదీర్‌ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

మజ్జిగ పంపిణీ

ట్యాంకర్‌ బీభత్సం– ఒకరి మృతి

మణికొండ: వాటర్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలుచున్న కార్లతోపాటు పలువురిని ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టీ గ్రిల్‌ జంక్షన్‌ వైపు నుంచి కోకాపేట వైపు వేగంగా వస్తున్న నీటి ట్యాంకర్‌ అదుపు తప్పి రోడ్డు పక్కన తన కారులో ఎక్కుతున్న భద్ర(30) అనే వ్యక్తిని ఢీ కొట్టింది. అతని తల, కాళ్లకు తీవ్ర గాయాలు కావటంతో రక్తస్రావం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మరో కారును ట్యాంకర్‌ ఢీ కొట్టింది. అందులో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ ఎం.శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మండీ బిర్యానీ తిని

ఆస్పత్రి పాలు

కాప్రా: ఏఎస్‌రావునగర్‌లోని ఓ మండీ హోటల్‌లో బిర్యానీ తిన్న నలుగురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నాలుగు రోజుల క్రితం హోటల్‌కు వెళ్లి మండీ బిర్యానీ తిని ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు మొదలవ్వడంతో జమ్మిగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మండీ బిర్యానీ తినడం వల్లే ఆస్పత్రి పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులు సదరు హోటల్‌ను పరిశీలించేందుకు వెళ్లగా, అది మూసి ఉంది. హోటల్‌ మూసి ఉండటంతో ఏమీ తెలుసుకోలేకపోయామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని కాప్రా సర్కిల్‌ ఇన్‌చార్జ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అధికారిణి మిలీషా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement