రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి
మాడ్గుల: రైతులకు కొర్రీలు లేకుండా రుణమాఫీ చేసి రైతు భరోసా పూర్తిగా అందజేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతం మాధవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూరియాను యాప్ ద్వారా అందించే విధానంలో లోపాలను సరిదిద్ది, సమయానికి సులభతరంగా పంటకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. పాలక వర్గాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటాన్నారని.. తక్షణమే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో పంట బీమా పథకాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సూదిని రంగారెడ్డి, రైతు సంఘం నాయకులు బిచ్చయ్య, విజయ్, నరేందర్, నర్సింహ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


