హయత్‌నగర్/చంపాపేట: ఎల్‌బీనగర్ పరిధిలో బుధవారం వర్షం దంచికొట్టింది. పలు చోట్ల వరద నీరు ఏరులై పారింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోత ఉక్కిబిక్కిరి చేయగా సుమారు గంట పాటు గాలి, వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడా గాలికి చెట్లు నేలకొరిగాయి. రహదారి పక్కన పార్కింగ్ చేసిన కారుపై భారీ వృక్షం కూలిన ఘటన చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ సింధూర హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారును పార్కింగ్ చేసి షాపింగ్‌కు వెళ్లాక ఈ ఘటన జరిగింది. స్థానికులు ఆందోళనతో పరుగులు తీశారు. కారులో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది భారీ వృక్షాన్ని తొలగించారు.


