డీసీఎంను ఢీకొట్టిన స్కూల్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

డీసీఎంను ఢీకొట్టిన స్కూల్‌ బస్సు

Feb 28 2026 8:42 AM | Updated on Feb 28 2026 8:42 AM

డీసీఎ

డీసీఎంను ఢీకొట్టిన స్కూల్‌ బస్సు

16 మంది విద్యార్థులకు గాయాలు

మోకిల శివారులో ప్రమాదం

బస్సు నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

ప్రమాదానికి గురైన పాఠశాల బస్సు

శంకర్‌పల్లి: నలభై మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు అదుపుతప్పి ముందున్న డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 16మంది విద్యార్థులకు స్వల్పగాయాలవగా, పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామ శివారులో చోటు చేసుకుంది. మోకిల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి పట్టణంలోని నారాయణ స్కూల్‌లో ప్రకాశ్‌గౌడ్‌ అనే వ్యక్తి బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం ఆయన ఆరోగ్యం బాగో లేకపోవడంతో తన కు మారుడైన అఖిల్‌గౌడ్‌(20)ను విధులకు పంపించా డు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి ఆ లస్యంగా సమాచారం ఇచ్చినటు్‌ల్‌ తెలిసింది. అ యితే అఖిల్‌గౌడ్‌ శుక్రవారం ఉదయం కొండకల్‌, కొండకల్‌తండా, మోకిల తదితర ప్రాంతాల నుంచి సుమారు 40మంది విద్యార్థులను తీసుకుని శంకర్‌పల్లికి వస్తున్నాడు. బస్సు మోకిల గ్రామ శివారు లోని శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి ఆలయం వద్దకు స్పీడ్‌ బ్రేకర్లు ఉండటంతో ముందుగా వెళ్తున్న డీసీఎం నెమ్మదించింది. అప్పటికే అతివేగం, అజాగ్రత్తగా ఉన్న డ్రైవర్‌ బస్సును నియంత్రించలేక డీసీఎంను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే భయాందోళనకు గురైన అఖిల్‌గౌడ్‌ తన తండ్రి ప్రకాశ్‌గౌడ్‌కు చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. బస్సులోని 16మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన మరో పాఠశాల బస్సులో శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలే కావడంతో ప్రథమ చికిత్స అందించి, ఇళ్లకు పంపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. డీసీఎం డ్రైవర్‌ మహేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్‌ అఖిల్‌గౌడ్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మోకిల ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు.

డీసీఎంను ఢీకొట్టిన స్కూల్‌ బస్సు 1
1/1

డీసీఎంను ఢీకొట్టిన స్కూల్‌ బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement