కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి

Feb 28 2026 8:42 AM | Updated on Feb 28 2026 8:42 AM

కేంద్

కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి

సంక్షేమానికి పెద్దపీట భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ ఉత్సవాలు

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కందుకూరు: కులం, మతం, డబ్బుతో రాజకీయం చేయని పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ తరఫున సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా గెలిచిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులతోనే ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు బాష, జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములుయాదవ్‌, కడారి జంగయ్యయాదవ్‌, అసెంబ్లీ కన్వీనర్‌ ఎల్మటి దేవేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి తేరటి లక్ష్మణ్‌ముదిరాజ్‌, రాష్ట్ర నాయకులు పల్లె కృష్ణగౌడ్‌, జిల్లా, మండల నాయకులు టి.జగదీశ్వర్‌రెడ్డి, అనేగౌని అశోక్‌గౌడ్‌, సాధ మల్లారెడ్డి, పి.శ్రీనివాస్‌గౌడ్‌, కొంతం జంగారెడ్డి, జిట్టా రాజేందర్‌రెడ్డి, ఎ.బాబురావు, పి.భిక్షపతి, గౌర ప్రభాకర్‌, అమరేందర్‌రెడ్డి, చిలకల రఘునందన్‌, దేశం సత్తిరెడ్డి, బి.మల్లేష్‌, ఎ.పాండు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య

అనంతగిరి: కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ పట్టణానికి చెందిన 78 మందికి కల్యాణలక్ష్మి, 31మందికి షాదీముబారక్‌, 23మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వికారాబాద్‌ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, కమిషనర్‌ విక్రంసింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజు, తహసీల్దార్‌ లక్ష్మినారాయణ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

దోమ: మండలంలోని శివారెడ్డిపల్లిలో వెలసిన రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మమ్మ, మాజీ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ చెన్నయ్య, గ్రామస్తులు సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం నిధులతోనే  రాష్ట్రంలో అభివృద్ధి 
1
1/1

కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement