ఆదరణ కోల్పోతున్న జాతీయ పార్టీలు | - | Sakshi
Sakshi News home page

ఆదరణ కోల్పోతున్న జాతీయ పార్టీలు

Feb 28 2026 8:42 AM | Updated on Feb 28 2026 8:42 AM

ఆదరణ కోల్పోతున్న జాతీయ పార్టీలు

ఆదరణ కోల్పోతున్న జాతీయ పార్టీలు

మహేశ్వరం: బీజేపీ గ్రాప్‌ రోజురోజుకూ పడిపోయి బీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అమీర్‌పేట్‌ గ్రామానికి చెందిన బీజేపీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి కరన్‌కోట్‌ నందీశ్వర్‌, శ్రీవేంకటేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు కరన్‌కోట్‌ మల్లికార్జున్‌, వార్డు సభ్యులు వర్కల సుధాకర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సబితారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. సిద్ధాంతాలు, ధర్మం, న్యాయం కోసం కోట్లాడే పార్టీల నాయకుల మనుగడ ప్రశ్నార్థాకంగా మారిందన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో బీజేపీ ఇదివరకు గెలుపొందిన 10 సర్పంచ్‌ స్థానాల నుంచి 5 స్థానాలకు పడిపోయిందన్నారు. గ్రామ పంచాయతీ బీజేపీ యువతను హిందూ–ముస్లిం మతాల పేరుతో రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించి చలిమంటలు కాచుకుంటుందన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మెజార్టీ సీట్లు కై వసం చేసుకుంటుదని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్‌రెడ్డిని కలిశారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ నర్సింగ్‌, నాయకులు చంద్రయ్య, రాయప్ప, అశోక్‌, సర్పంచ్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement