ప్రజా మన్ననలు పొందాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా మన్ననలు పొందాలి

Feb 28 2026 8:42 AM | Updated on Feb 28 2026 8:42 AM

ప్రజా మన్ననలు పొందాలి

ప్రజా మన్ననలు పొందాలి

పాలకులు చిత్త శుద్ధితో పని చేయాలి

నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి

షాద్‌నగర్‌ మున్సిపల్‌ పాలకవర్గానికి సన్మానం

షాద్‌నగర్‌: నూతనంగా ఎన్నికై న మున్సిపల్‌ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేసి, ప్రజల మన్ననలు పొందాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. కష్టపడి పని చేసేవారికి కాంగ్రెస్‌ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణాలు, గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బస్వం, వైస్‌ చైర్మన్‌ అందె మోహన్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ బాబర్‌ఖాన్‌, రఘునాయక్‌, శ్రీకాంత్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్‌, జంగ నర్సింహ్మ, రవికుమార్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement