షార్ట్‌ సర్క్యూట్‌తో టిప్పర్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో టిప్పర్‌ దగ్ధం

Feb 28 2026 8:42 AM | Updated on Feb 28 2026 8:42 AM

షార్ట

షార్ట్‌ సర్క్యూట్‌తో టిప్పర్‌ దగ్ధం

చేవెళ్ల: షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా టిప్పర్‌ క్యాబిన్‌లో అకస్మాత్తుగా అంటుకున్న మంటలతో ముందు భాగం పూర్తిగా కాలిపోయిన సంఘటన షాబాద్‌ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌ నుంచి షాబాద్‌ వైపు కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ షాబాద్‌ మండలంలోని అంతారం గేట్‌ వద్దకు రాగానే క్యాబిన్‌లో షార్టు సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. దీంతో డ్రైవర్‌ అప్రమత్తమై టిప్పర్‌ని రోడ్డు పక్కకు ఆపి కిందికి దిగిపోయాడు. మంటలు ఒక్కసారి గా పెద్ద ఎత్తున వ్యాపించి లారీ ము ందు భాగం క్యాబిన్‌ దగ్ధమైంది. వెంటనే స్థానికులు ఫైర్‌ ఇంజిన్‌, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది వచ్చేసరికే లారీ ముందు భాగం టైర్లతో సహా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజాసేవకు అంకితమవ్వండి

అడిషనల్‌ కలెక్టర్‌ సుధీర్‌బాబు

కొడంగల్‌: సర్పంచులు ప్రజాసేవకు అంకితమవ్వాలని అడిషనల్‌ కలెక్టర్‌ సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల అవసరాలు తెలుసుకోవాలన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. సర్పంచ్‌ పదవికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఆ గ్రామానికి ఆయనే మొదటి పౌరుడని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, మాస్టర్‌ ట్రైనర్స్‌ వినయ్‌కుమార్‌, రాములు, డీఎల్‌పీఓ సంధ్య, ఎంపీడీఓలు ఉషశ్రీ, వెంకన్న గౌడ్‌, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ ఎంపీఓలు సుందర్‌, యాదగిరి, దయానంద్‌, అంజిరెడ్డి పాల్గొన్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో టిప్పర్‌ దగ్ధం 1
1/1

షార్ట్‌ సర్క్యూట్‌తో టిప్పర్‌ దగ్ధం

Advertisement
 
Advertisement
Advertisement