వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Feb 28 2026 8:42 AM | Updated on Feb 28 2026 8:42 AM

వ్యక్

వ్యక్తి అదృశ్యం

పహాడీషరీఫ్‌: వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన మోస్టకిమ్‌ ఆలం(43) బతుకుదెరువు నిమిత్తం మామిడిపల్లికి వలస వచ్చాడు. ఈ నెల 24వ తేదీన రాత్రి తోటి కార్మికులతో కలిసి మద్యం తాగిన అతడు కిరాణ దుకాణానికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి, ఎంతకి తిరిగి రాలేదు. ఈ విషయమై తోటి కార్మికుడు అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

కేంద్రం నిధులతోనే అభివృద్ధి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

రమేశ్‌కుమార్‌

తాండూరు రూరల్‌: కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పెద్దేముల్‌ మండలం దుగ్గాపూర్‌లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ప్రతి గ్రామానికీ సీసీరోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు రాము, రాంసాగర్‌ పాల్గొన్నారు.

వ్యక్తి అదృశ్యం 1
1/1

వ్యక్తి అదృశ్యం

Advertisement
 
Advertisement
Advertisement