సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రదర్శనలు
కడ్తాల్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడుతాయని లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేందర్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక మేళాను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే కొత్త ఆలోచనలపై దృష్టి సారించి, సాంకేతిక రంగంలో ఎదగాలని అకాంక్షించారు. ప్రకృతిలో ఉన్న ఎన్నో విషయాలను సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన 195 వైజ్ఞానిక ప్రదర్శనలను వివిధ పాఠశాలల విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సువర్ణగోవర్ధన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జైసన్, లయన్స్ క్లబ్ కేబినెట్ కార్యదర్శి అంజయ్య, లయన్స్‌క్లబ్ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, క్లబ్ కార్యదర్శి గంప శ్రీను, మాజీ సర్పంచ్ ఎల్‌ఎన్‌రెడ్డి, నాయకులు కడారి రామకృష్ణ, జహంగీర్‌బాబా తదితరులు ఉన్నారు.
లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేందర్‌కుమార్‌రెడ్డి


