నాణ్యమైన విద్యను అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యను అందించాలి

Feb 27 2026 10:50 AM | Updated on Feb 27 2026 10:50 AM

నాణ్యమైన విద్యను అందించాలి

నాణ్యమైన విద్యను అందించాలి

మంచాల: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ శివరతన్‌ ఆర్టీయస్‌ అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్‌ తరగతులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఆటస్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా నూతన ఆవి ష్కరణలకు కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ప్రయోగశాలల వినియోగంలో తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రోత్సహించి హైస్కూల్‌ స్థాయిలోనే ఉపాధి కల్పనకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. ఇక్కడి పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఆట స్థలం, గ్రంథాలయం బాగున్నాయన్నారు. కార్యక్ర మంలో జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, రాష్ట్ర మానిటరింగ్‌ అధికారి నెల్సన్‌, రాష్ట్ర వయోజన విద్యా డైరెక్టర్‌ జయ చంద్రారెడ్డి, ఎంఈఓ రాందాస్‌, ప్రధానోపాధ్యాయుడు గిరధర్‌గౌడ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement