కరివేపాకు సెంచరీ | - | Sakshi
Sakshi News home page

కరివేపాకు సెంచరీ

Feb 27 2026 10:50 AM | Updated on Feb 27 2026 10:50 AM

కరివేపాకు సెంచరీ

కరివేపాకు సెంచరీ

కరివేపాకు సెంచరీ

గౌలిపురా: కరివేపాకు దూకుడు మీదుంది. నగర మార్కెట్లలో కిలో కరివేపాకు రూ.100–120 వరకు పలుకుతోంది. చిన్న కట్ట కావాలన్నా రూ.10 పెట్టాల్సిందే. రెండు నెలల క్రితం కిలో ధర రూ.50–60 ఉండగా.. ప్రస్తుతం రెండింతలైంది. చలి కారణంగా ఆకులు రాలిపోవడంతో నగరానికి దిగుమతి భారీగా తగ్గిపోయింది. అరకొరగా వచ్చే దిగుమతులతో ధరలకు రెక్కలొచ్చాయి. గుడిమల్కాపూర్‌, మాదన్నపేట్‌, బోయిన్‌పల్లి, మీరాలంమండి, శంషాబాద్‌ తదితర హోల్‌సేల్‌ మార్కెట్లలో కిలో రూ.80–100 వరకు పలుకుతుండగా.. వారాంతపు సంతలు, ఇతర లోకల్‌ మార్కెట్లలో కిలో రూ.100–120 ధర పలుకుతోంది. మరో నెల రోజుల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement