ఎన్‌ఎంఎంఎస్‌లో విద్యార్థుల సత్తా
మంచాల: నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పథకానికి విద్యార్థులు ఎంపిక కావడం గర్వంగా ఉందని మండలంలోని ఆరుట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రియ అన్నారు. మంచాల మండలంలో ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అందులో ఆరుట్ల మోడల్ స్కూల్‌లోనే నలుగురు విద్యార్థులున్నారు. ఈ మేరకు గురువారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రియ స్కాలర్ షిప్ పథకానికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా విద్యార్థులకు సంవత్సరానికి రూ.12వేల ఉపకార వేతనం వస్తుందన్నారు. ఆరుట్ల మోడల్ స్కూల్‌లో ఆందోజ్ అక్షయ్, ఉత్తరపల్లి లోకేశ్, దొడ్డి గణేష్, రత్నావత్ దత్త ఈ స్కాలర్ షిప్‌లు సాధించారని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


