షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేసుకోవాలి

Feb 26 2026 9:15 AM | Updated on Feb 26 2026 9:15 AM

షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేసుకోవాలి

షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేసుకోవాలి

చేవెళ్ల: నర్సరీల్లో పెంచుతున్న మొక్కల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. ప్రతీ నర్సరీలో తప్పనిసరిగా పది ప్రైమరీ బెడ్స్‌ ఉండేలా చూసుకోవాలని జిల్లా ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్‌ రాంచంద్రయ్య అన్నారు. బుధవారం ఆయన షాబాద్‌ మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ, సంకేపల్లిగూడ, పంచాయతీల్లో ఉన్న నర్సరీలను స్థానిక సర్పంచ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలను పరిశీలించారు. మొక్కలకు ఎండ వేడి తగలకుండా షేడ్‌నెట్‌ వేసుకోవాలని సూచించారు. ఆయన వెంట నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారి వీరాసింగ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, పవన్‌ ఉప సర్పంచ్‌ మానిక్యం, ఫీల్ట్‌ అసిస్టెంట్‌ బల్వంత్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

జిల్లా ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్‌ రాంచంద్రయ్య

Advertisement
 
Advertisement
Advertisement