ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం

Feb 26 2026 9:13 AM | Updated on Feb 26 2026 9:13 AM

ప్రమా

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పదవీ బాధ్యతల స్వీకరణ వినీషకు డాక్టరేట్‌

మొయినాబాద్‌: మున్సిపల్‌ పాలకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మొయినాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోనియా దర్శన్‌ బుధవారం ఆయన్ను కలిసి ఈ నెల 27న జరిగే చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ప్రమాణస్వీకారోత్సవం, కౌన్సిలర్ల సన్మానసభకు హాజరవ్వాలని కోరారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, మండలి ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులను కలిసి ప్రమాణస్వీకారోత్సవం, సన్మాన సభకు ఆహ్వానించారు.

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా సాత ప్రవీణ్‌ కుమార్‌, వైస్‌ చైర్‌పర్సన్‌గా జూలకంటి శ్వేత బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శంకర్‌పల్లి పట్టణాభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని.. ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో ఆదర్శ మున్సిపల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ యోగేశ్‌, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఎ.వినీష కేఎల్‌ డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ను కనుగొనడంలో ఆమె చేసిన పరిశోధనలు ఈ ఘనత సాధించిపెట్టాయి. ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం (ఈసీఈ)కు చెందిన రీసెర్చ్‌ స్కాలర్‌ అయిన ఆమె మెడికల్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో చేసిన అత్యుత్తమ పరిశోధనలకు గాను ఈ డిగ్రీ సాధించారు. కేఎల్‌హెచ్‌ అజీజ్‌నగర్‌లోని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవి బోడ మార్గదర్శకత్వంలో డీప్‌ లెర్నింగ్‌ పద్ధతులు ఉపయోగించి, సమర్థవంతమైన రీతిలో బ్రెయిన్‌ ట్యూమర్‌ కనుగొనడం, క్లాసిఫికేషన్‌ అల్గోరిథం అభివృద్ధి అనే అంశంపై పరిశోధనలు పూర్తి చేశారు. వీటిద్వారా మొదడు ఎంఆర్‌ఐ చిత్రాల నుంచి గ్లియోమా, మెనింగియోమా, పిట్యూటరీ కణతులను ఖచ్చితంగా గుర్తించడానికి, వర్గీకరించడానికి ఈ అత్యంత అధునాతన నమూనాను ఉపయోగించారు. పీహెచ్‌డీ రావడం, తన బాధ్యతను మరింత పెంచిందని వినీష పేర్కొన్నారు.

పేదలకు అండగా కాంగ్రెస్‌

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

మంచాల: కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలలకు అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన నగరంలోని నివాసంలో 46 మంది బాధితులకు మంజూరైన రూ.17.49లక్షల విలువైన సీఎంఆర్‌ఆఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలకు మేలు చేసే లా సంక్షేమ పథకాలు అమలుకు కృషి చేస్తున్నా రు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రమాకాంత్‌రెడ్డి, మండల నాయకులు చంద్రయ్య, సురేశ్‌, బాలరాజ్‌, పరమేశ్‌, అశోక్‌, బుగ్గ రాములు, జగన్‌, నాగరాజు, మధు, నవీన్‌, సాయికుమార్‌ పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం 1
1/3

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం 2
2/3

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం 3
3/3

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం

Advertisement
 
Advertisement
Advertisement