పెండింగ్‌ వేతనాలు చెల్లించండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ వేతనాలు చెల్లించండి

Feb 26 2026 9:13 AM | Updated on Feb 26 2026 9:13 AM

పెండింగ్‌ వేతనాలు చెల్లించండి

పెండింగ్‌ వేతనాలు చెల్లించండి

ఇబ్రహీంపట్నం రూరల్‌: పంచాయతీ సిబ్బంది పెండింగ్‌ బకాయి వేతనాలు చెల్లించాలని లేదంటే వారం రోజుల్లో ఆందోళన చేపడతామని పంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్‌ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ పంచాయతీ సిబ్బందిని 2వ పీఆర్‌సీ పరిఽధిలోకి తీసుకురావాలన్నారు. జీఓ 51 ను సవరించి, మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరిలన్నింటినీ కొనసాగించాలని కోరారు. కారోబార్‌, బిల్‌ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు, ఇన్సూరెన్స్‌, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. పంచాయతీల అవసరాల ప్రతిపాదికన కార్మికుల సంఖ్యను పెంచాలని, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణ, శ్రీనివాస్‌, పెంటయ్య, దేవదాసు, జ్యోతి, జగన్‌, శేఖర్‌, మాధవి తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాండు

Advertisement
 
Advertisement
Advertisement