ఇండియా అబ్బాయి.. నేపాల్ అమ్మాయి
ఆస్ట్రేలియాలో ప్రేమ.. పెద్దఅంబర్‌పేటలో పెళ్లి
అబ్దుల్లాపూర్‌మెట్: ఇండియాకు చెందిన యువకుడు.. నేపాల్‌కు చెందిన యువతి మధ్య ఆస్ట్రేలియాలో చిగురించిన ప్రేమ.. ఇరు కుటుంబాలను ఒప్పించి, తెలుగు సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిపించింది. ఈ వేడుకకు పెద్దఅంబర్‌పేటలోని తారా కన్వెన్షన్ హాల్ వేదికై ంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్‌బీనగర్ మన్సూరాబాద్‌లో నివాసముండే ప్రభుత్వ ఉద్యోగి గుండెగోని యాదగిరిగౌడ్, యశోద దంపతుల కుమారుడు సతీష్‌కుమార్‌గౌడ్ ఆస్ట్రేలియాలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే ఉద్యోగం చేస్తున్న నేపాల్‌కు చెందిన సయేషాను ప్రేమించాడు. ఈవిషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పి, అందరినీ ఒప్పించి, వివాహం చేసుకున్నారు. నేపాలీ సంప్రదాయ వస్త్రాలను ధరించిన యువతి తరఫు బంధువులు. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన వేడుకల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


