సులువైన బోధనతో మెరుగైన ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

సులువైన బోధనతో మెరుగైన ఫలితాలు

Feb 26 2026 9:13 AM | Updated on Feb 26 2026 9:13 AM

సులువైన బోధనతో మెరుగైన ఫలితాలు

సులువైన బోధనతో మెరుగైన ఫలితాలు

సులువైన బోధనతో మెరుగైన ఫలితాలు

కొత్తూరు: విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమైయ్యే రీతిలో బోధన చేస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని పీఎంశ్రీ కమిటీ నోడల్‌ అధికారి శివరతన్‌ అన్నారు. బుధవారం ఆయన తన బృందంతో కలిసి పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాలలో అమలు చేస్తున్న అటల్‌ ల్యాబ్‌, ఐటీసీ, స్టెమ్‌, ఏవీఆర్‌ల్యాబ్‌లతో పాటు లైబ్రరీలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు కరాటే విన్యాసాలను వీక్షించారు. డిజిటల్‌ బోధన ద్వార కలుగుతున్న ప్రయోజనాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివరతన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం ద్వార ల్యాబ్‌లు, ఇతర సామగ్రిని అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌, జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ నాగమణి, ఏఎంఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పీఎంశ్రీ కమిటీ నోడల్‌ అధికారి శివరతన్‌

Advertisement
 
Advertisement
Advertisement