గంజాయి ముఠా అరెస్ట్
● బీహార్ నుంచి తెచ్చి, కార్మికులకు విక్రయిస్తున్న నిందితులు
● పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు
● ముగ్గురికి రిమాండ్
షాద్‌నగర్ రూరల్: గంజాయి విక్రయిస్తున్న ముఠాకు చెందిన ముగ్గురిని అధికారులు రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. ఫరూఖ్‌నగర్ మండల పరిధి చింతగూడ శివారులోని శ్రీబాలాజీ పౌల్ట్రీఫామ్‌లో బీహార్ రాష్ట్రానికి చెందిన ఆత్మమహతో టేకేదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను బీహార్ నుంచి గంజాయి తెచ్చి, చిన్నచిన్న ప్యాకెట్లలో నింపి, బూర్గుల, కాశిరెడ్డిగూడ, చింతగూడ, షాద్‌నగర్ పరిధిలోని పరిశ్రమలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులకు విక్రయిస్తున్నాడు. ఈ విషయంపై పక్కా సమాచారంతో అందుకున్న డివిజన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం ఆయా ఫ్యాక్టరీల వద్ద దాడులు నిర్వహించారు. ఆత్మమహతోను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 1.7 కిలోల ఎండు గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, తూకం మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కార్మికులకు గంజాయిని విక్రయిస్తున్న ఆత్మమహతో పాటు అతనికి సహకరిస్తున్న బీహార్‌కు చెందిన సుశీల్‌కుమార్, ప్రేమ్‌రామ్‌ను అరెస్టు చేసి, ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ దాడులలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ బాలరాజు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


