అక్రమ నిర్మాణాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Feb 26 2026 9:13 AM | Updated on Feb 26 2026 9:13 AM

అక్రమ

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత ఫిర్యాదుల పరంపర

మొయినాబాద్‌: జంట జలాశయాల్లో కాలుష్య నివారణపై జలమండలిలో కదలిక వచ్చింది. ఉస్మాన్‌సాగర్‌(గండిపేట), హిమాయత్‌సాగర్‌ జలాశయాల్లోకి మురుగు నీరు చేరి కలుషితం అవుతున్న తీరుపై ‘జంట.. కాలుష్యపు కుంట!’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. గండిపేట జలాశయం బఫర్‌ జోన్‌లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చివేశారు. హిమాయత్‌నగర్‌ సర్వేనంబర్‌ 17లో నీళ్ల విక్రయం కోసం ఏర్పాటు చేసిన గుంతలను ధ్వంసం చేశారు. జలాశయం ఒడ్డున రెస్టారెంట్‌ ఏర్పాటు చేసి బఫర్‌ జోన్‌లో నిర్మించిన బాత్‌రూంలను నేలమట్టం చేశారు. రెస్టారెంట్‌, బాత్‌రూం వ్యర్థాలు చెరువులోకి చేరకుండా అడ్డుకున్నారు. జలాశయాల్లో కాలుష్య నివారణకోసం ఎస్టీపీల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం కౌన్సిలర్లపై పరస్పర ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లపై ఫిర్యాదు చేశారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్‌ దారు రాఘవేందర్‌రావుపై బీజేపీ అభ్యర్థి జక్క రవీందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్‌గా పలు పనులు చేసి, మున్సిపాలిటీ నుంచి నేరుగా లబ్ధిపొందిన రాఘవేందర్‌రావు కౌన్సిలర్‌ పదవికి అనర్హుడని, ఆయనపై వేటు వేయాలని బుధవారం ఆర్డీఓ అనంతరెడ్డికి ఫిర్యాదులో పేర్కొన్నారు.

అక్రమ నిర్మాణాల  కూల్చివేత  1
1/1

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Advertisement
 
Advertisement
Advertisement