భూమి కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

భూమి కేటాయింపు

Feb 25 2026 11:36 AM | Updated on Feb 25 2026 11:36 AM

భూమి కేటాయింపు

భూమి కేటాయింపు

కోహెడ మార్కెట్‌కు

అబ్దుల్లాపూర్‌మెట్‌: కోహెడలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలపడంతో పాటు సర్వేనంబర్‌ 167లోని 239 ఎకరాల భూమిని కేటాయిస్తున్న ప్రకటించడంపై గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. బాటసింగారంలోని మార్కెట్‌ కార్యాలయంలో మంగళవారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్లు, అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మరోసారి రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం నిలిచిందని అన్నారు. వీలైనంత త్వరలో మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతామని తెలిపారు. మార్కెట్‌ నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడానికి సహకరించిన సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్‌ రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ భాస్కర్‌చారి, డైరెక్టర్లు జైపాల్‌రెడ్డి, అంజయ్య, లక్ష్మి, మధుసూదన్‌రావు, గణేశ్‌నాయక్‌, మచ్చేందర్‌రెడ్డి, నర్సింహ, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం, మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కేబినెట్‌ ఆమోదంతో పాలకవర్గం హర్షం

సీఎం చిత్రపటానికి పండ్ల రసాలతో అభిషేకం

Advertisement
 
Advertisement
Advertisement