స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లతోమెరుగైన ఉపాధి
కొత్తూరు: స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లతో యువత, నిరుద్యోగులకు పెద్ద పెద్ద పరిశ్రమల్లో సైతం మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నందిగామ మండలంలోని కన్హాలో మంగళవారం నిర్వహించిన ఇండియా స్కిల్ కాంపిటిషన్స్ 2025–26 దక్షిణ ప్రాంత పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి శాఖను ప్రక్షాళన చేసి అభివృద్ధి శాఖగా మారుస్తామన్నారు. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా మార్చుతున్నట్లు వివరించారు. ఆధునిక యంత్రాలు, డిజిటల్ పరికరాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంపిటీషన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్ఛేరి, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో భాగంగా ప్రతిభ కనబర్చిన వారికి బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐఏఎస్ కాంతి వెస్లీ, నవీన్‌కుమార్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి


