సక్రమంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సక్రమంగా నిర్వహించాలి

Feb 25 2026 11:36 AM | Updated on Feb 25 2026 11:36 AM

సక్రమంగా నిర్వహించాలి

సక్రమంగా నిర్వహించాలి

సక్రమంగా నిర్వహించాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఇంటర్‌ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఆర్‌సీలు, పోలీస్‌శాఖ, విద్యుత్‌, విద్యాశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, డివిజన్‌ స్థాయిలో సంబంధిత అధికారులతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాల్లో పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలన్నారు. విధులు నిర్వర్తించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, అనంతరెడ్డి, సరిత, మున్సిపాలిటీ కమిషనర్లు, జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి వెంక్యా నాయక్‌, విద్యాశాఖాధికారి సుశీందర్‌రావు, వైద్యాధికారి లలితాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement