తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాటు విక్రయం | - | Sakshi
Sakshi News home page

తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాటు విక్రయం

Feb 25 2026 11:35 AM | Updated on Feb 25 2026 11:35 AM

తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాటు విక్రయం

తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాటు విక్రయం

కొందుర్గు: తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి దేవుడి భూములనే కాజేసేందుకు ప్రయత్నించిన నిందితులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కొందుర్గు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన సర్వేనంబర్‌ 77లో గల 355 చ.గజాల ఖాళీ స్థలం ఉంది. దీన్ని స్థానికంగా ఉండే బోయ శంకర్‌, బోయ రామచంద్రయ్య, బోరిగే యాదయ్య, కొమురబండ నర్సింలు, మల్కని నవీన్‌కుమార్‌ గౌడ్‌, బాచరాజు రామారావు, బాచరాజు శ్రీనివాసరావు కలిసి 2020లో షాబాద్‌ మండలం నాగర్‌గూడకు చెందిన దేవాసీ జగదీష్‌ విక్రయించారు. ఆయన సదరు స్థలంలో ఇంటిని నిర్మించేందుకు ప్రయత్నించగా ఎండోమెంట్‌ అధికారులు ఆక్షేపణ తెలిపారు. దీంతో మోసాపోయానని గ్రహించిన జగదీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ శ్రీనివాసు ఆధ్వర్యంలో నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రవీందర్‌ నాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement