ప్రేమ విఫలమై విద్యార్థిని బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై విద్యార్థిని బలవన్మరణం

Feb 25 2026 11:35 AM | Updated on Feb 25 2026 11:35 AM

ప్రేమ విఫలమై విద్యార్థిని బలవన్మరణం

ప్రేమ విఫలమై విద్యార్థిని బలవన్మరణం

గచ్చిబౌలి: మూడేళ్లుగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బీఎస్సీ విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసులు తెలిపిన మేరకు.. వైజాగ్‌కు చెందిన కోమలి (21)చిత్రపురి కాలనీలో బంధువుల వద్ద ఉంటూ బీఎస్సీ చదువుతూ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ ఉంటుంది. వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, యూట్యూబర్‌ అఖిల్‌ రెడ్డితో కోమలి మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే ఇటీవల ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం కోమలి ఆత్మహత్యా యత్నం చేయడంతో పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. అఖిల్‌ దూరంగా ఉంటానని చెప్పినా కోమలి వినిపించుకోలేదు. రెండు రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. అఖిల్‌ పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం చీరతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అఖిల్‌ రెడ్డిని విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తన కూతురు కోమలిని అఖిల్‌ రెడ్డి మోసం చేయడంతో చనిపోయిందని తల్లి వరలక్ష్మీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement