వీధి కుక్కల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

వీధి కుక్కల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

వీధి కుక్కల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు

వీధి కుక్కల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు

యాచారం: మండల పరిధిలోని యాచారం, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఏడుగురిపై సోమవారం వీధి కుక్క లు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఆ యా గ్రామాలకు చెందిన రేణుక, రమేష్‌, బుగ్గయ్య, జంగయ్య, హర్థిక, అయూష్‌, పూజను వీధి కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం యాచారం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు వారికి చికిత్స చేసి పంపించారు.

బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టండి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: లైసెన్స్‌ ఫీజుల బకాయిల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని జిల్లా ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ పి.దశరథ్‌ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో జిల్లా పరిధిలోని ఎకై ్సజ్‌ సూపరింటెండెట్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్దే శిత మద్యం లక్ష్యాలను ఎస్‌హెఓలు, ఈఎస్‌లు పర్యవేక్షించి వాటిని చేరుకోవాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు, డీటీఎఫ్‌ టీమ్‌లు లైసెన్స్‌ కలిగిన మద్యం దుకాణాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని, ఎన్‌డీపీఎల్‌, ఫ్యూరియస్‌ లిక్కర్‌ అమ్మకాలు జరగకుండా చూడాలన్నారు. వీటితో పాటు గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు, రవాణపై నిఘా పెట్టాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ కిషన్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సరూర్‌నగర్‌ ఈఎస్‌లు నవీన్‌, భాస్కర్‌ గౌడ్‌, ఉజ్వలారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement