తెలంగాణ పోలీస్‌ వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా మహేశ్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీస్‌ వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా మహేశ్‌

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

తెలంగ

తెలంగాణ పోలీస్‌ వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా మహేశ్‌

కడ్తాల్‌: కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న 74వ ఆల్‌ ఇండియా వాలీబాల్‌ క్లస్టర్‌ క్రీడా పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. పోటీల్లో పాల్గొనే తెలంగాణ పోలీస్‌ జట్టు కెప్టెన్‌గా కడ్తాల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అంబటి మహేశ్‌ వ్యవహరించనున్నారు. దీనిపై సీఐ గంగాధర్‌, ఎస్‌ఐలు వరప్రసాద్‌, చంద్రశేఖర్‌, స్థానిక పోలీస్‌ సిబ్బంది అభినందించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

ఇబ్రహీంపట్నం రూరల్‌: అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పేర్కొన్నారు. మార్చి 7న టీజీఓ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీఓ నాయకులు శాంతిశ్రీ, రేవతి, అలివేలు, మహేశ్వరి, సైదమ్మ, బాలేశ్వరి, నరేందర్‌, మసూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కేసులకు

జంకేది లేదు

బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్‌

తుర్కయంజాల్‌: శాంతి భద్రతలను కాపాడటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్‌ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుల దాడిని ఖండిస్తూ సోమవారం ఆదిబట్ల సర్కిల్‌ పరిధి తుర్కయంజాల్‌లో పార్టీ స్థానిక అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని పేర్కొ న్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొత్త రాంరెడ్డి, కందాళ బల్‌దేవ్‌ రెడ్డి, పురుషోత్తం, రవీందర్‌ రెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

జంట జలాశయాల కాలుష్యంపై వివరణ ఇవ్వండి

హిమాయత్‌, ఉస్మాన్‌సాగర్‌లపై సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు తాగునీరందించే జంట జలాశయాలు హిమాయత్‌, ఉస్మాన్‌ సాగర్‌లలో కాలుష్య కారకాలు పెరిగిపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర పీసీబీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 26కు వాయిదా వేసింది. జంట జలాశయాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిందంటూ వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. జలాశయాల నిర్వహణ విభాగాలు, అధికారులు సమగ్ర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మురుగు శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాలు చేరకుండా తీసుకున్న చర్యలను వివరించాలని స్పష్టం చేసింది.

తెలంగాణ పోలీస్‌ వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా మహేశ్‌ 
1
1/3

తెలంగాణ పోలీస్‌ వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా మహేశ్‌

తెలంగాణ పోలీస్‌ వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా మహేశ్‌ 
2
2/3

తెలంగాణ పోలీస్‌ వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా మహేశ్‌

తెలంగాణ పోలీస్‌ వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా మహేశ్‌ 
3
3/3

తెలంగాణ పోలీస్‌ వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా మహేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement