మున్సిపాలిటీల అభివృద్ధికి సహకారం
చేవెళ్ల: మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పూ ర్తిగా సహకారం అందిస్తుందని ఐటీశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మండలకేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో సోమవారం నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతారెడ్డి, వైస్ చైర్మన్ రాముగౌడ్, కౌన్సిలర్ల సన్మాన సభ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న చైర్‌పర్సన్, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపా రు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన ఉండాలని, అప్పడే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. గెలవడంతో అయిపోలేదని, గెలుపుతో బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, నాయకులు దర్శన్, బాల్‌రాజ్, జనార్దన్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వీరేందర్‌రెడ్డి, మధుసూదన్‌గుప్తా, శంకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


