ఎదురొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

ఎదురొచ్చిన మృత్యువు

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

ఎదురొ

ఎదురొచ్చిన మృత్యువు

బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్‌ లారీ అక్కడికక్కడే ఇద్దరు యువకుల దుర్మరణం మరో యువకుడికి తీవ్ర గాయాలు హైతాబాద్‌లో విషాదం

చేవెళ్ల: ఎదురుగా వచ్చిన కంటైనర్‌లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగరగూడ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. హైతాబాద్‌ గ్రామానికి చెందిన హైదరగూడ ఉదయ్‌కిరణ్‌ (19), దాసరి అజయ్‌(19), ఎండీ ఆజమ్‌ స్నేహితులు. శనివారం బైక్‌పై చేవెళ్లకు వచ్చి రాత్రి 12 గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. నారగూడ సమీపంలో ఎదురుగా వచ్చిన కంటైనర్‌లారీ వీరిని ఢీకొట్టింది. ఉదయ్‌కిరణ్‌, అజయ్‌ క్షణాల్లో ప్రాణాలు కోల్పోగా, ఆజమ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఉదయ్‌కిరణ్‌ తండ్రి రాజు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అజయ్‌కు తల్లి లేకపోవటంతో నాన్న దాసరి వెంకటయ్య కూలీ పనులు చేస్తూ కొడుకును చూసుకుంటున్నాడు. చేతికందిన కొడుకులు చనిపోవడంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. గాయపడిన ఆజమ్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తూ ఒంటిరిగా ఉంటున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఎదురొచ్చిన మృత్యువు 1
1/2

ఎదురొచ్చిన మృత్యువు

ఎదురొచ్చిన మృత్యువు 2
2/2

ఎదురొచ్చిన మృత్యువు

Advertisement
 
Advertisement
Advertisement