అక్రిడిటేషన్‌కార్డుల్లో కోత పెట్టడం సరికాదు
ఇబ్రహీంపట్నం రూరల్: వర్కింగ్ జర్నలిస్టుందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ప్రస్తుతం ఉన్న కార్డులకు కోత పెట్టడం సరికాదన్నారు. నియోజకవర్గం, మున్సిపాలిటీ, మండ లాల్లో పని చేసే జర్నలిస్టులతో పాటు డెస్క్‌లో పని చేసే వారికి కార్డులు ఇవ్వాలని, జీవో 252ను సవరించాకే కమిటీలు నియమించాలని కోరారు. అనంతరం డీఆర్‌ఓ, డీపీఆర్‌ఓలకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గణేశ్, కార్యదర్శి సైదులు, నాయకులు చంద్రశేఖర్, సురేష్, ఖాజా పాషా, అజయ్‌కుమార్, రాజేందర్, వెంకటేశ్, సుదర్శన్, మణి, నర్సింహారెడ్డి, క్రాంతి, అంజి, శ్రీశైలం, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.


