ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్‌ టోర్నీ

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్‌ టోర్నీ

ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్‌ టోర్నీ

ఖమ్మం స్పోర్ట్స్‌: రాష్ట్రస్థాయి అండర్‌–19 బాలబాలికల సీఎం కప్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో బాలుర విభాగంలో కామారెడ్డి, బాలికల విభాగంలో మెదక్‌ ప్రథమ స్థానాలు దక్కించుకున్నాయి. బాలుర విభాగంలో రెండు, మూడో స్థానాలను రంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌, బాలికల విభాగంలో రెండో స్థానం అతిథ్య జట్టు ఖమ్మం దక్కించుకోగా, మూడోస్థానంలో నిజామాబాద్‌ జట్టు నిలిచింది. ఇక బాలుర డబుల్స్‌లో కుమురంభీం ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, నల్లగొండ, బాలికల విభాగంలో మెదక్‌, వరంగల్‌, ఖమ్మం జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. విజేతలకు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, సీఎం కప్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కె.ఆదర్శ్‌కుమార్‌, పాఠశాలల క్రీడల సంఘం జిల్లా కార్యదర్శి వై.రామారావు, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్‌బాబు, బాల్‌బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేజెల్ల సురేష్‌, బొంతు శ్రీనివాసరావు, సీనియర్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు రమణ బహుమతులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement