అర్హులకు అక్రిడేషన్ కార్డులివ్వండి
షాద్‌నగర్‌రూరల్: అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎండీ ఖాజాపాషా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఖాజాపాషా మాట్లాడుతూ.. ఈసారి ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందన్నారు. జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రిడేషన్ కార్డులను జారీ చేయాలన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. అక్రిడేషన్ కార్డుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానన్నారు. అనంతరం కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాకు జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఖాజాపాషా


