అక్రమ నిర్మాణాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత

బడంగ్‌పేట్‌: శ్మశానవాటికలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు బడంగ్‌పేట్‌లోని వైకుంఠధామంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని సర్వేనంబర్‌ 110లో హిందూ శ్మశానవాటికకు గతంలో 6.23 ఎకరాలను కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో శ్మశాకవాటికను అభివృద్ధి చేశారు. కొంతభాగం ప్రహరీ నిర్మించి మిగిలిన భాగం వదిలేశా రు. దీంతో ఆ స్థలంలో గుడి నిర్మాణానికి గిరిజను లు ఆదివారం పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు తాము కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని శ్మశానవాటికకు సోమవారం తరలివచ్చారు. స్థానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న బాలాపూర్‌ తహసీల్దార్‌ ఇందిరాదేవి, డిప్యూటీ తహసీల్దార్‌ మణిపాల్‌రెడ్డి, సిబ్బంది పోలీసులతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనుమతి లేకుండా నిర్మించిన దిమ్మెను కూల్చివేశారు. దీంతో అధికారుల చర్యకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే శ్మశానవాటికకు పకడ్బందీగా ప్రహరీ నిర్మించాలని కోరారు.

బడంగ్‌పేట్‌ శ్మశానవాటికలో ఉద్రిక్త పరిస్థితులు

Advertisement
 
Advertisement
Advertisement