ట్రేడ్‌ లైసెన్సులు జారీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌ లైసెన్సులు జారీ చేయాలి

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

ట్రేడ్‌ లైసెన్సులు జారీ చేయాలి

ట్రేడ్‌ లైసెన్సులు జారీ చేయాలి

మీర్‌పేట: బడంగ్‌పేట సర్కిల్‌ పరిధిలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి అన్ని వాణిజ్య సంస్థలకు ట్రేడ్‌ లైసెన్సులు జారీ చేయాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.చంటి ముదిరాజ్‌ సోమవారం సర్కిల్‌ డీసీ సరస్వతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారానికి గుర్తింపు లభించేందుకు ట్రేడ్‌ లైసెన్సు చట్టపరమైన అధికారిక పత్రమని, లైసెన్సు పొందడం ద్వారా ప్రభుత్వ, వివిధ సంస్థల నుంచి అనేక ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. దీంతో పాటు ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేస్తే సులభంగా రుణాలు పొందవచ్చన్నారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకున్న వ్యాపారులు ప్రమాదాల సందర్భంలో నష్టపరిహారం పొందేందుకు ట్రేడ్‌ లైసెన్సులు ఎంతో ఉపయోగపడతాయని, పర్మినెంట్‌ ట్రేడ్‌ లైసెన్సు తీసుకుంటే ఏటా రెన్యూవల్‌ మాత్రమే చేయాల్సి ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, రాష్ట్ర కార్యదర్శి కడమంచి అజయ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల మల్లేష్‌, కన్వీనర్‌ గుడ్డేటి ప్రవీణ్‌, ఉపాధ్యక్షులు దీపక్‌ కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement