ఇద్దరు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు అదృశ్యం

Feb 23 2026 9:16 AM | Updated on Feb 23 2026 9:16 AM

ఇద్దర

ఇద్దరు అదృశ్యం

మీర్‌పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన (మూగ) వ్యక్తి అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. నాగార్జునసాగర్‌ సమీపంలోని నాయకునితండాకు చెందిన మేరావత్‌ శ్రీను(30) మూడు నెలల క్రితం ప్రశాంతిహిల్స్‌లో నివాసముండే సోదరుడి వద్దకు వచ్చి నందిహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన శ్రీను మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో సోదరుడు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యతో గొడవ పడి..

అబ్దుల్లాపూర్‌మెట్‌: భార్యతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో అనుగుల జయప్రకాశ్‌రెడ్డి(70) తన భార్య లక్ష్మితో నివాసముంటున్నారు. ఇరువురి మధ్య శనివారం ఉదయం గొడవ జరగడంతో ఇంటి నుంచి జయప్రకాశ్‌రెడ్డి బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. దీంతో లక్ష్మి ఈ విషయాన్ని కూతుళ్లకు చెప్పడంతో ఆచూకీ కోసం బంధువులు, పరిసరాల్లో వెతికినా లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు అదృశ్యం 1
1/2

ఇద్దరు అదృశ్యం

ఇద్దరు అదృశ్యం 2
2/2

ఇద్దరు అదృశ్యం

Advertisement
 
Advertisement
Advertisement