పోరాటాలతోనే ప్రజల్లో చైతన్యం | - | Sakshi
Sakshi News home page

పోరాటాలతోనే ప్రజల్లో చైతన్యం

Feb 22 2026 8:36 AM | Updated on Feb 22 2026 8:36 AM

పోరాటాలతోనే ప్రజల్లో చైతన్యం

పోరాటాలతోనే ప్రజల్లో చైతన్యం

యాచారం: పోరాటాలతోనే ప్రజల్లో చైతన్యం వస్తుందని, అధికారంలోని ఉన్నా.. లేకున్నా అన్యాయంపై ఎర్రజెండాకే ఎదురించే శక్తి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పేర్కొన్నారు. శనివారం మాల్‌ కేంద్రంలో రెడ్‌ బుక్‌ డే పుస్తక పఠన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కమ్యూనిష్టులు పుస్తకాల ద్వారానే ప్రజల్లో చైతన్యం అవుతారని, 1848 ఫిబ్రవరి 21న ప్రపంచానికి ప్రణాళిక పుస్తకాలను పరిచయం చేశారన్నారు. సంపద కొందరి చేతుల్లోనే ఉంటుందని, కానీ పుస్తక జ్ఞానం అందరిలో వస్తుందన్నారు. ప్రతి పౌరుడు పూర్వ పుస్తకాలను చదివి జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో పుస్తక జ్ఞానం ఎంతో ముఖ్యమన్నారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా సీపీఎం పేదల సంరక్షణ కోసం పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి నర్సింహ, నాయకులు పి.అంజయ్య, జంగయ్య, చందునాయక్‌, వెంకటయ్య, లాజర్‌, బాలరాజ్‌, విప్లవ్‌కుమార్‌, తావునాయక్‌ పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య

Advertisement
 
Advertisement
Advertisement