ముగిసిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు

Feb 22 2026 8:36 AM | Updated on Feb 22 2026 8:36 AM

ముగిసిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు

ముగిసిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ అండర్‌–19 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు సాయంత్రం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రికర్వ్‌ బాలుర విభాగంలో పి.నాగసాయి కృషివ్‌రెడ్డి(రంగారెడ్డి), ఏ.వెంకటేష్‌(వరంగల్‌), టి.వెంకట యోగీశ్వర్‌(ఖమ్మం) మొదటి మూడు స్థానాల్లో నిలిచి బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. రికర్వ్‌ బాలికల విభాగంలో కె.లోహితశ్రీ(భద్రాద్రి కొత్తగూడెం), ఎన్‌.షన్విత(కరీంనగర్‌), బి.కృపారాణి(వరంగల్‌), కాంపౌండ్‌ బాలుర విభాగంలో కె.బూవన్‌ సాకేత్‌(మేడ్చల్‌), ఎన్‌.కృతిక్‌ శ్రీవాత్సవ్‌(మహబూబ్‌నగర్‌), వి.సంవర్ధన్‌రెడ్డి(హైదరాబాద్‌), బాలికల విభాగంలో ఆర్‌.హన్సికరావు(పెద్దపల్లి), ఎన్‌.స్మృతి సన్నిభ(మహబూబ్‌నగర్‌), ఎం.శ్రీనిక (నిజామాబాద్‌) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే, ఇండియన్‌ రౌండ్‌ బాలుర విభాగంలో కె.రాంచరణ్‌(భద్రాద్రి కొత్తగూడెం), టి.సునీల్‌కుమార్‌(నిర్మల్‌), ఆర్‌.భార్గవ్‌(ఖమ్మం), బాలికల విభాగంలో చిట్టె మాన్య(మేడ్చల్‌), జి.నిహారిక(నిర్మల్‌), సీహెచ్‌.రష్మితరెడ్డి(సిద్ధిపేట) మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement