యథావిధిగా ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

యథావిధిగా ప్రజావాణి

Feb 22 2026 8:36 AM | Updated on Feb 22 2026 8:36 AM

యథావి

యథావిధిగా ప్రజావాణి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్‌ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 23న సోమవారం యథావిథిగా కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిందని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎప్పటిలాగే కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. బాధితులు స్వయంగా హాజరై, తమ సమస్యలను విన్నవించుకోవచ్చని సూచించారు.

మళ్లీ విధుల్లోకి అదనపు

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) ప్రతి మా సింగ్‌ మళ్లీ విధు ల్లో చేరారు. ఆమె కొంతకాలంగా ప్రసూతి సెలవుల్లో వెళ్లారు. మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు శ్రీనివాస్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరించారు. ప్రతిమా సింగ్‌ రాకతో ఆయన తన పూర్వస్థానంలోకి వెళ్లిపోయారు.

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యుల ఎంపిక

షాద్‌నగర్‌: ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యులుగా పట్టణానికి చెందిన పవన్‌ చౌహాన్‌, ఆకాశ్‌నాయక్‌ ఎన్నికయ్యారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆలిండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర 4వ మహాసభలను నిర్వహించారు. ఈ సభల్లో సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర సమితి సభ్యులుగా పవన్‌ చౌహాన్‌, ఆకాశ్‌నాయక్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నుకున్నందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

రైతులకు న్యాయం చేయాలని వినతి

శంకర్‌పల్లి: గిరిజన రైతులకు న్యాయం చేయాలని శనివారం సీపీఐ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకుడు పానుగంటి పార్వతాలు మాట్లాడుతూ.. శంకర్‌పల్లి మండలంలోని పొన్నగుట్ట తండా గిరిజనులకు గతంలో ప్రభుత్వం సాగు చేసుకునేందుకు అసైన్డ్‌ భూములను కేటాయించిందన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనుల కోసమని ఆ భూములను తిరిగి వెనక్కి తీసుకొని రైతులకు ఎకరానికి 800 గజాల భూమి ఇస్తుందన్నారు. అయితే అధికారులు గుర్తించిన జాబితాలో భూమికి సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఉన్నాయని, 800 గజాల భూమిని అసలు రైతులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దానికి సంబంధించిన పత్రాలను అదనపు కలెక్టర్‌కి అందించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేవారు. కార్యక్రమంలో నాయకులు రామస్వామి, ప్రభులింగం, సుధీర్‌, రాజేందర్‌, రైతులు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌ రద్దు

సాక్షి, సిటీబ్యూరో: నిబంధనలు అతిక్రమించే మెడికల్‌ దుకాణాలు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) డైరెక్టర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాసీం హెచ్చరించారు. హేబిట్‌ ఫార్మింగ్‌ డ్రగ్స్‌ అమ్మకాలపై శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 166 మెడికల్‌ దుకాణాల్లో చట్టవిరుద్ధంగా హెచ్‌–1, షెడ్యూల్డ్‌ ఎక్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయని గుర్తించి నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు.

యథావిధిగా ప్రజావాణి
1
1/4

యథావిధిగా ప్రజావాణి

యథావిధిగా ప్రజావాణి
2
2/4

యథావిధిగా ప్రజావాణి

యథావిధిగా ప్రజావాణి
3
3/4

యథావిధిగా ప్రజావాణి

యథావిధిగా ప్రజావాణి
4
4/4

యథావిధిగా ప్రజావాణి

Advertisement
 
Advertisement
Advertisement