కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం
అనంతగిరి: వికారాబాద్ పట్టణ పరిధిలోని అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్‌లో శనివారం రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వికారాబాద్ పట్టణంలోని ఎస్‌ఏపీ కళాశాల మైదానానికి మధ్యాహ్నం 2.50గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతగిరి హరిత రిసార్ట్స్‌కు 3.02 గంటలకు వెళ్లారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో పాల్గొని సాయంత్రం 5గంటలకు వికారాబాద్ చేరుకున్నారు. 5.26 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
కట్టుదిట్టమైన భద్రత
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ ప్రత్యేక చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అనంతగిరి గుట్ట వైపు వెళ్లే వాహనాలను బుగ్గ మీదుగా మళ్లించారు.
ఘన స్వాగతం
హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు రా మ్మోహన్‌రెడ్డి,మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, డీఐజీ చౌహాన్, ఎస్పీ స్నేహమెహ్ర, ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందజేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గ డ్డం అనన్యను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించా రు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.


