విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి

Feb 22 2026 8:36 AM | Updated on Feb 22 2026 8:36 AM

విద్య

విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి

● ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి

షాద్‌నగర్‌: విద్యార్థులు చదువుతోపాటుగా సృజనాత్మక పెంపొందించుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి సూచించారు. శనివారం షాద్‌నగర్‌ పరిఽధిలోని నందిగామ మండలం కన్హా శాంతి వనంలో కేంద్ర స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియా స్కిల్స్‌ కాంపిటీషన్‌ పోటీలను నిర్వహించారు. ఈ నెల 24 వరకు జరగనున్న ఈ పోటీల్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్ష్యదీప్‌ల నుంచి వివిధ కళాశాలలకు చెందిన 350 మందికి పైగా విద్యార్థులు 63 విభాగాల్లో పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి హాజరై మాట్లాడుతూ.. యువత విద్యతో పాటుగా, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జీవితానికి అవసరమైన మెళకువలను చదువుతోపాటుగా నేర్చుకోవాలన్నారు. ఉన్నతస్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకొని రాణించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, తద్వారా ఒత్తిడిని ఎదుర్కొనే మనోధైర్యం లభిస్తుందన్నారు. రైజింగ్‌ తెలంగాణలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ఉన్నత విద్యతో పాటుగా, నైపుణ్యం ఎంతో ముఖ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రధాని మోదీ చెప్పిన విధంగా 2030 వరకు దేశంలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలతో 20లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.

విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి1
1/1

విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి

Advertisement
 
Advertisement
Advertisement