24న చలో సెక్రటేరియట్‌ | - | Sakshi
Sakshi News home page

24న చలో సెక్రటేరియట్‌

Feb 22 2026 8:36 AM | Updated on Feb 22 2026 8:36 AM

24న చలో సెక్రటేరియట్‌

24న చలో సెక్రటేరియట్‌

ఇబ్రహీంపట్నం: పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 24న చేపట్టనున్న చలో సెక్రటేరియట్‌ వాల్‌ పోస్టర్‌ను శనివారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఎదుట ఆ సంఘం జేఏసీ నేతలు ఆవిష్కరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, 2021 వేతన సవరణ, పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం, కార్మికులకు ఉద్యోగ భద్రత, యూనియన్ల పునరుద్ధరణ తదితర సమస్యలపై చలో సెక్రటేరియట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు సురేశ్‌యాదవ్‌, శ్రీశైలం, అబ్దుల్‌రజాక్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement