ఘనంగా ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

Feb 22 2026 8:36 AM | Updated on Feb 22 2026 8:36 AM

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

శంకర్‌పల్లి: మున్సిపాలిటీ పరిధిలోని రామంతాపూర్‌లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేడుకల్లో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రంగురంగుల పూలతో ముస్తాబు చేసి, పల్లకీపై ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు మున్సిపాలిటీతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ప్రశాంత్‌, నాయకులు వెంకట్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, మల్లయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement