మామిడిలో పూత సమయం కీలకం | - | Sakshi
Sakshi News home page

మామిడిలో పూత సమయం కీలకం

Feb 20 2026 11:03 AM | Updated on Feb 20 2026 11:03 AM

మామిడిలో పూత సమయం కీలకం

మామిడిలో పూత సమయం కీలకం

కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకృష్ణ

చేవెళ్ల: మామిడి రైతులు పూత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులను తెలుసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా శాస్త్రవేత్త శ్రీకృష్ణ సూచించారు. చేవెళ్ల మున్సిపల్‌ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో రైతు సత్యనారాయణరెడ్డి మామిడి తోటలో గురువారం యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సకాలంలో మామిడిలో వచ్చే తెగుళ్లను గుర్తించి నయం చేసుకుంటే మంచి దిగుబడులు సాధిస్తారన్నారు. రైతులకు మామిడి తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఎలాంటి సమస్యలు ఉన్న రైతులు ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ ఏపీడీ కిషన్‌రావు, గ్రీన్‌గ్లో టెక్నాలజీస్‌ ప్రభు, ఏటీజీసీ డైరెక్టర్‌ శశిధర్‌, సెర్ప్‌ సీఓ రాజశేఖర్‌, ఉద్యాన అధికారులు కీర్తి, నగేశ్‌, బలరాం, కృష్ణ, రైతులు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాసులు, రాజిరెడ్డి, ఇస్మాయిల్‌, శివ తదతరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement