డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

Feb 20 2026 11:03 AM | Updated on Feb 20 2026 11:03 AM

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

శంకర్‌పల్లి: నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నసో వ్యక్తిని మోకిల, షాద్‌నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కాచిగూడకి చెందిన మల్లేవాలే జయానంద్‌ సింగ్‌(28) పబ్‌లో డీజే ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన ఆయన సులభంగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్‌ సరఫరాని ఎంచుకున్నాడు. గత కొంతకాలంగా ముంబై నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ని తీసుకొచ్చి, విద్యార్థులు ఉండే ప్రదేశాల్లో విక్రయాలు జరుపుతున్నాడు. గురువారం మండల పరిధిలోని జన్వాడ గేట్‌ వద్ద డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు వచ్చినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మోకిల, షాద్‌నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి జయానంద్‌ని అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి రూ.1.25 లక్షల విలువ గల 10.18గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ పౌడర్‌, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎండీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement