ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తాం
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి
మొయినాబాద్: రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్‌లోని అంజనాదేవి గార్డెన్‌లో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ బలంగా ఉందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులే అత్యధికంగా గెలవడం అందుకు నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయాక పార్గీ గుర్తులపై జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవేనని, కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసి అత్యధిక సీట్లు గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, మాజీ సర్పంచ్‌లు శ్రీహరియాదవ్, నరోత్తంరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్‌లు డప్పు రాజు, రవుఫ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


