పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్‌గా గణేశ్‌గౌడ్
కడ్తాల్: మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కానం గణేశ్‌గౌడ్ పీసీసీ లీగల్ సెల్(న్యాయ, మానవ హక్కుల, సమాచార హక్కు) స్టేట్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన్ని నియమిస్తూ పీసీసీ లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గణేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డికి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వంశీచంద్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, నాయకులు సురేందర్‌రెడ్డి, బీచ్యానాయక్, నరేందర్ తదితరులు ఉన్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచంద్‌రెడ్డి నాయకులకు సూచించారు. ఆయన నివాసంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహలతో పాటు పలువురు నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.


