దివ్యాంగులకు అండగా ఉంటాం
చాదర్‌ఘాట్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆదివారం మలక్‌పేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో పాటు పాఠ్యపుస్తకాలు బ్రెయిలీ లిపిలో అందజేస్తామని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. పది రోజులలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వికలాంగుల సంక్షేమానికి రూ. 100 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ అనితరామచంద్రన్, వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బి.శైలజ, జీఎం ప్రభంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


