‘సర్కిల్’ తరలింపు సరికాదు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆదిబట్ల హెడ్‌క్వార్టర్‌లోనే నడిపించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. తరలింపును నిరసిస్తూ శనివారం ఆదిబట్ల కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాత్రికిరాత్రే ఆదిబట్ల నుంచి రాగన్నగూడకు కార్యాలయాన్ని తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆదిబట్ల హైటెక్ నగరంగా ఎదుగుతుంటే ఓర్వలేక ఈ పని చేశారని విమర్శించారు. ఆదిబట్ల నుంచి కలెక్టరేట్ దగ్గరగా ఉంటుందని, శంషాబాద్ వెళ్లడం కూడా సులభమేనని తెలిపారు. కార్యాలయం తరలించడానికి కారణమైన డిప్యూటీ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, పల్లె రజినీకాంత్‌గౌడ్, శ్రావణ్‌గౌడ్, శ్రీశైలం, జమ్మరాజు, సాయిబాబా, బాబు, పాండురంగారెడ్డి, నర్సింహ, బీఆర్‌ఎస్ నాయకులు పల్లె గోపాల్‌గౌడ్, సుధాకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, భాస్కర్, బీజేపీ నాయకులు కోరె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


