శ్రీరాముడి మార్గం అనుసరణీయం
షాద్‌నగర్‌రూరల్: మానవాళికి శ్రీరామచంద్రుడు చూపిన మార్గం అనుసరణీయమని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) క్షేత్రప్రముఖ్ బండారి రమేశ్ అన్నారు. పట్టణంలోని భగీరథ కాలనీ, డ్రీం విల్లాస్ కాలనీల్లోని కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం విశ్వహిందూ పరిషత్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు పానుగంటి రోజా ఆధ్వర్యంలో సత్సంగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. హైందవ సంస్కృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. హిందూ సమాజం ఐక్యతతోనే భారతదేశానికి శ్రీరామ రక్ష అన్నారు. కలియుగంలో మానవాళికి శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడని, పితృవాక్య పరిపాలకుడి బాటలో మనమందరం నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ విభాగ్ సహ కార్యదర్శి మఠం రాచయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు భాగ్యవతి, నాయకులు నరహరి, శశిధర్, రంగయ్య, బాలబ్రహ్మచారి, హన్మంత్‌రెడ్డి, కోటేష్, హరిత తదితరులు పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ క్షేత్ర ప్రముఖ్ రమేశ్


