గ్రామాలపై ప్రత్యేక నిఘా
● ఘర్షణలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణ
● పంచాయతీ ఎన్నికల్లో కట్టుదిట్టమైన బందోబస్తు
యాచారం: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మండలంలోని యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌ల పరిధిలో మంతన్‌గౌరెల్లి, గునుగల్, చౌదర్‌పల్లి, ధర్మన్నగూడెం, చింతుల్ల, మొండిగౌరెల్లి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తండా, మాల్, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లోని రౌడీ షీటర్లను, బెల్టు దుకాణాదారులను ఇప్పటికే తహసీల్దార్ అయ్యప్ప ఎదుట బైండోవర్లు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతుండడంతో ఆదివారం యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌ల సీఐలతో పాటు పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరికలు చేశారు. వారం రోజులుగా విందు భోజనాలకు ఆయా గ్రామాల్లో అభ్యర్థులు వేసిన టెంట్లను తొలగించేశారు. సమస్యాత్మాక గ్రా మాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేలా ఇబ్ర హీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలకు ఆదేశించారు. ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రకటన వరకు ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ అమ లులో ఉంటుందని గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారా యణ, యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.


